అమరావతి : ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బాంబు పేల్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీలోని ప్రముఖ నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం(YS jagan) చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు.