Fire Accident : ఉత్తరాదిన వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మరోవైపు మండు వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలోని కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్లో పార్క్ చేసిన వాహనాలు శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి.
వ్యాన్‌లో మంటలు చెలరేగడంతో పక్కన పార్క్ చేసిన వాహనాలకూ నిప్పంటుకుంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని బులంద్‌షహర్ రూరల్ ఎస్పీ రోహిత్ మిశ్రా తెలిపారు.
ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని అగ్నిప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 వాహనాలు అక్కడ ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదానికి కారణమేంటనే వివరాలు ప్రాథమిక దర్యాప్తు అనంతరం వెలుగుచూస్తాయని అన్నారు.
Read More :
Malaika Arora, Arjun Kapoor | బ్రేకప్ చెప్పుకున్న మలైకా అరోరా- అర్జున్ కపూర్.?