Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి ఉత్తరప్రదేశ్ లక్నోకు వెళ్తున్న రైలుపై రాళ్ల దాడి (Stones Thrown) జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
22546 నంబర్ గల వందే భారత్ రైలు గురువారం లక్నోకు వెళ్తోంది. ఈ క్రమంలో లక్సర్ – మొరదాబాద్ రైల్వే సెక్షన్‌లోని ఖరంజా కుతుబ్‌పూర్ గ్రామ సమీపంలోకి రాగానే రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో C-6 కోచ్ కిటికీ అద్ధానికి పగుళ్లు ఏర్పడ్డాయి (Window Cracks). ఈ ఘటనతో రైల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై లోకో పైలట్ మొరదాబాద్‌లోని కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఆర్పీఎఫ్కు చెందిన బృందం కుతుబ్‌పూర్ గ్రామానికి చేరుకొని ఘటనపై విచారణ చేటప్టింది. ఈ మేరకు 22 ఏళ్ల సల్మాన్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
Also Read..
Balochistan | పాక్ రైల్వే స్టేషన్లో పేలుడు.. 20 మంది మృతి
Sanjiv Khanna | మార్నింగ్ వాక్ అలవాటును వదులుకున్న తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
Jharkhand | ఎన్నికల వేళ కీలక పరిణామం.. జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ సోదాలు