Jharkhand | అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాత్సవ (Sunil Srivastava)పై ఆదాయ పన్ను శాఖ (IT Raids) టార్గెట్ చేసింది. రాంచీలోని అశోక్ నగర్లో గల ఆయన ఇంటిపై ఐటీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. దాంతో పాటు రాంచీ, జంషెడ్‌పూర్‌లో దాదాపు తొమ్మిది చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
సునీల్ శ్రీవాత్సవ కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. అయితే ఎంత మొత్తం పన్ను ఎగవేశారన్నది తెలియరాలేదు. ఈ కారణంగానే ఐటీ అధికారులు దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రా, అతని సహచరుల రహస్య స్థావరాలపై కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.50 లక్షల నగదు, కిలో బంగారం, వెండి, 61 కాట్రిడ్జ్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
#WATCH झारखंड: मुख्यमंत्री हेमंत सोरेन के निजी सचिव सुनील श्रीवास्तव के रांची स्थित आवास पर केंद्रीय एजेंसी की छापेमारी जारी है।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/ay1pJ7wZhg
— ANI_HindiNews (@AHindinews) November 9, 2024
కాగా, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి (Jharkhand Assembly Elections) రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా.. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.
Also Read..
Lucky Car | కారుకు అంత్యక్రియలు.. హాజరైన సాధువులు, ఆధ్యాత్మిక గురువులు
Rupee | రూపాయికి మరిన్ని చిల్లులు.. చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిన విలువ