Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge)పై వందేభారత్ రైలు (Vande Bharat train) పరుగులు పెట్టింది. ఈ వంతెనపై శనివారం వందేభారత్ రైలు ఫస్ట్ ట్రయల్ రన్స్ నిర్వహించారు. ట్రయల్ రన్స్‌లో భాగంగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకూ వందే భారత్ రైలు పరుగులు పెట్టింది.
#WATCH | Jammu and Kashmir: Visuals of Vande Bharat train crossing the world’s highest railway bridge Chenab Rail Bridge
Indian Railways today started the trial run of the first Vande Bharat train from Shri Mata Vaishno Devi Railway Station Katra to Srinagar. The train will also… pic.twitter.com/6IgVfxCgYk
— ANI (@ANI) January 25, 2025
కాగా, ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో మరిన్ని మార్గాలకు ఈ రైళ్లను కేంద్ర విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL)లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే వందే భారత్ రైలును ఈ ఏడాది ప్రారంభించేందుకు కేంద్ర సిద్ధమైంది.
#WATCH | Jammu and Kashmir: Indian Railways today started the trial run of the first Vande Bharat train from Shri Mata Vaishno Devi Railway Station Katra to Srinagar
(Visuals from Srinagar Railway Station) pic.twitter.com/WjWjL5iZcl
— ANI (@ANI) January 25, 2025
మొత్తం 272 కిలోమీటర్ల మేర ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ లింక్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తైంది. కత్రా, రిసియా మధ్య కొంత మేర పెండింగ్‌లో ఉంది. ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్ము, కాట్రా గుండా వెళతాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం.
ఇక కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందేభారత్‌ను ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. కశ్మీర్ లోయలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో బయట విపరీతమైన మంచు కురుస్తున్నా లోపల ఉన్న ప్రయాణికులు వెచ్చదనాన్ని ఆస్వాదించేలా ఈ రైలును రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రైల్లోని నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు కేవలం రూ.1,500 నుంచి రూ.2100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు సమాచారం.
చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తైంది.
Also Read..
Mumbai Attack | ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు అమెరికా సుప్రీం ఓకే
Samantha | పికిల్‌బాల్ మ్యాచ్‌లో సమంత సందడి.. అట్లీ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులు