Viral news | అర్ధరాత్రి ప్రియురాలి కోసం వెళ్లి గ్రామస్తుల చేతిలో తన్నులు తిన్న ప్రియుడు
Viral news | వివాహిత అయిన యువతితో ఓ యువకుడు వివాహేతర బంధం సాగిస్తున్నాడు. తరచూ రాత్రి వేళల్లో అమె ఉంటున్న గ్రామానికి వెళ్లి కలిసి వస్తున్నాడు. ఎప్పటిలాగే ఇటీవల కూడా కాపాలా కోసం తన ఇద్దరు స్నేహితులను తీసుకుని అర్ధరాత్రి ఆ గ్రామంలోకి ప్రవేశించాడు. ముగ్గురూ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో వారిని దొంగలుగా భావించిన గ్రామస్తులు చుట్టుముట్టారు.
Viral news : వివాహిత అయిన యువతితో ఓ యువకుడు వివాహేతర బంధం సాగిస్తున్నాడు. తరచూ రాత్రి వేళల్లో అమె ఉంటున్న గ్రామానికి వెళ్లి కలిసి వస్తున్నాడు. ఎప్పటిలాగే ఇటీవల కూడా కాపాలా కోసం తన ఇద్దరు స్నేహితులను తీసుకుని అర్ధరాత్రి ఆ గ్రామంలోకి ప్రవేశించాడు. ముగ్గురూ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో వారిని దొంగలుగా భావించిన గ్రామస్తులు చుట్టుముట్టారు. దాంతో భయపడ్డ అతడి స్నేహితులు పారిపోయారు. అతడు మాత్రం గ్రామస్తుల చేతిలో తీవ్రంగా తన్నులు తిన్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం హాపూర్ జిల్లా (Hapur district) లోని అమ్రోహా (Amroha) లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అమ్రోహా గ్రామంపై ఇటీవల ఓ డ్రోన్ తిరుగుతూ కనిపించింది. దాంతో దొంగలు డ్రోన్ సాయంతో దొంగతనాలకు టార్గెట్లను గుర్తించి దోపీడీలకు పాల్పడుతున్నారనే వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో గ్రామస్తులు గత కొన్ని రోజులుగా దొంగలను పట్టుకునేందుకు గస్తీ కాస్తున్నారు. ఇది తెలియని యువకుడు అదే గ్రామానికి చెందిన తన వివాహిత ప్రేయసిని కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లాడు. వెంట ఇద్దరు స్నేహితులను కాపాలాగా తీసుకెళ్లాడు. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ ముగ్గురూ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటాన్ని గస్తీ కాస్తున్న గ్రామస్తులు చాటుగా ఉండి గమనించారు. అప్పటికే ప్రియురాలి ఇంటిని సమీపించిన యువకుడిపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడి చేశారు. ఇది గమనించి అక్కడి కొద్ది దూరంలో ఉన్న యువకుడి స్నేహితులు పారిపోయారు. చేతికి చిక్కిన యువకుడిని అర్ధరాత్రి ఎందుకు వచ్చావని నిలదీయగా ప్రియురాలి విషయం బయటపడకుండా ఉండేందుకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
దాంతో అతడు కచ్చితంగా దొంగేనని నిర్ధారించుకున్న గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. అతడు దొంగ కాదని నిర్ధారించుకున్న తర్వాత మరోసారి అర్ధరాత్రిపూట ఆ గ్రామంలోకి వెళ్లనని సదరు యువకుడితో హామీ రాయించుకుని విడిచిపెట్టారు. మాటతప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Read More >>
బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే జోక్యం చేసుకుంటాం : సుప్రీంకోర్టు
టెర్రరిస్టుల ఏరివేతలో ఆ రెండు ఆపరేషన్‌లది కీలక పాత్ర : ప్రధాని మోదీ
అరెస్ట్ చేయాల్సింది గూండాలను.. సన్యాసినిలను కాదు.. బీజేపీపై శశిథరూర్ ఫైర్
హోంమంత్రి అమిత్ షా వైఫల్యంవల్లే పహల్గాం ఉగ్రదాడి : గౌరవ్ గొగోయ్
‘వాళ్లు ఎవరో ఏందో నాకైతే తెల్వదు’.. పహల్గాం ఉగ్రవాదుల హతంపై ఫరూఖ్ అబ్దుల్లా
నా చేతులారా వాళ్లను కాల్చి చంపాలనుకునేదాన్ని.. ఉగ్రవాదుల హతంపై పహల్గాం మృతుడి భార్య.. Video
ఛత్తీస్‌గఢ్ భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

