PM Modi : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించి హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లోక్సభ (Lok Sabha) లో చేసిన ప్రసంగంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. ఉగ్రవాదుల (Terrorists) ను ఏరివేయడంలో ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కీలకపాత్ర పోషించాయని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్ గురించి హోంమంత్రి అమిత్ షా లోక్సభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారని ప్రధాని మోదీ చెప్పారు. దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తన ప్రసంగంలో సవివరంగా చెప్పారని ట్వీట్ చేశారు. అంతకుముందు లోక్సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఉనికికి నెహ్రూనే కారణమని ఆరోపించారు.
1948లో భారత సైనిక దళాలు పీవోకేను చేజిక్కించుకునే స్థానంలో ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడంవల్ల ఆ అవకాశం చేజారిపోయిందని అమిత్ షా విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా నెహ్రూ చర్యలను వ్యతిరేకించారని గుర్తుచేశారు. తూర్పు పాకిస్థాన్ విమోచన యుద్ధం సమయంలోనూ పీఓకేను దక్కించుకునే అవకాశం వచ్చినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేజార్చుకుందని అన్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని పొందలేకపోవడానికి కూడా నెహ్రూనే కారణమని అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ నిర్ణయాలవల్లే మనకు ఇంకా భద్రతామండలిలో శాశ్వత స్థానం దక్కలేదని చెప్పారు. యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం కోసం మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశంపై ఉగ్రవాదులు కుట్రలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవడానికి ప్రస్తుతం ఉన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదని, మోదీ ప్రభుత్వమని అమిత్ షా వ్యాఖ్యానించారు.