Shashi Tharoor : మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు, బలవంతంగా మత మార్పిడిలు చేయిస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్గఢ్ (Chhattishgarh) లో కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన ఇద్దరు సన్యాసినిల (Nuns) ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. దేశంలో అల్లరిమూక (Mob) పాలన కొనసాగుతున్నదని విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.. ఎలాంటి తప్పు చేయకున్నా అమాయకులను తీసుకెళ్లి జైళ్లలో పెడుతున్నారని శశిథరూర్ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ అరెస్ట్ చేసిన ఇద్దరు కేరళ సన్యాసినిలను ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సింది గూన్స్నని, నన్స్నని కాదని వ్యాఖ్యానించారు.