Farooq Abdullah : పహల్గాం (Pahalgam) లో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల (Terrorists) ను భద్రతాబలగాలు (Security forces) మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం లోక్సభ (Lok Sabha) లో ప్రకటించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) తనదైన శైలిలో స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ఆ ముగ్గురు ఉగ్రవాదులలేనో లేదంటే మరొకరో అని అనుమానిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
‘ఎన్కౌంటర్లో హతమైన ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరో.. ఏందో.. నాకైతే తెలియదు’ అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ‘పహల్గాం దాడికి పాల్పడింది హతమైన ఆ ముగ్గురు ఉగ్రవాదులేనని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అదే నిజమైతే ప్రభుత్వానికి నా అభినందనలు’ అని అన్నారు. కాగా పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు శ్రీనగర్లో ఉన్నారనే సమాచారం అందడంతో సోమవారం భద్రతాదళాలు ఆ ఏరియాను చుట్టుముట్టి ముగ్గురిని హతమార్చాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ లోక్సభలో ప్రకటించారు. దీనిపై అభిప్రాయం తెలియజేయాలని మీడియా ప్రతినిధులు ఫరూఖ్ అబ్దుల్లాను పలుకరించగా ఆయన పైవిధంగా స్పందించారు.