Pragati Jagdale : పహల్గామ్ (Pahalgam) మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని సోమవారం భద్రతాబలగాలు మట్టుబెట్టడంపై బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లోని శ్రీనగర్ (Srinagar) లో పహల్గాం దాడి ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ‘ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev)’ పేరుతో వారిని వెతికి హతమార్చాయి. దాంతో ఆ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ జగ్దాలే (Santosh Jagdale) భార్య ప్రగతి జగ్దాలే (Pragati Jagdale) ముగ్గురు ఉగ్రవాదుల హతంపై స్పందించారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో తమకు కొంత న్యాయం జరిగిందని అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసిన భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన మూడు నెలలుగా తాను ఎంత క్షోభను అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేనని ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గద్గద స్వరంతో చెప్పారు.
‘నువ్వు పహల్గాంకు ఎందుకు వెళ్లావు..? నువ్వు తప్పకుంట ఇంటికి తిరిగి రావాలి’ అని తాను తరచూ ఆయన ఫొటోతో మాట్లాడుతున్నానని మీడియా ప్రతినిధులతో చెబుతూ ప్రగతి జగ్దాలే ఏడ్చారు. ఆ ఉగ్రవాదుల అంతం వార్త కోసం తాము ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ వార్త విన్నామని అన్నారు. ‘నా దగ్గర తుపాకీ ఎందుకు లేదు..? ఉంటే నేనే ఆ ఉగ్రవాదులను నా చేతులారా కాల్చి చంపేదాన్ని’ అని తాను తరచూ అనుకునేదాన్నని ప్రగతి జగ్దాలే చెప్పారు.
#WATCH | All 3 terrorists involved in the Pahalgam attack killed in Operation Mahadev, announced Union HM Amit Shah in Lok Sabha
In Pune, Pragati Jagdale, wife of Santosh Jagdale, who was killed in the Pahalgam terror attack, says, “Today we have got some justice that they were… pic.twitter.com/QW3NYL8sI7
— ANI (@ANI) July 29, 2025