బీజింగ్: ఉత్తర చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీజింగ్‌లో వరదలు(China Floods) ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఆ వర్షాల వల్ల 30 మంది మృతిచెందారని అధికారులు పేర్కొన్నారు. బీజింగ్‌లో అధికారులు హయ్యెస్ట్ ఫ్లడ్ ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటి వరకు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని రోజుల పాటు బీజింగ్ పరిసర ప్రాంతాల్లో వరదలు రానున్నాయి. సుమారు 130 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. డజన్ల సంఖ్యలో రోడ్లు కొట్టుకుపోయాయి. జలమయమైన ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని రెస్క్యూ చేస్తున్నారు. వరదల్లో మిస్సైన వారిని రక్షించాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదేశించారు. సాధారణంగా ఈ సీజన్లో బీజింగ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. 2012లో జూలైలో వచ్చిన వరదల వల్ల 79 మంది మృతిచెందారు.
రికవరీ చర్యల కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే 200 మిలియన్ల యువాన్ల నిధిని కేటాయించింది. డ్యామేజ్ అయిన రోడ్లు, నీటి కేంద్రాలు, వైద్యం, మౌళిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు. మియున్ ముజియా విమానాశ్రయం నుంచి వరద బాధితుల కోసం ఆహార పదార్ధాలను తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్లను అందిస్తున్నారు. సాధారణంగా ఈ సీజన్లో బీజింగ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. 2012లో జూలైలో వచ్చిన వరదల వల్ల 79 మంది మృతిచెందారు.