Gaurav Gogoi : కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్‌షా (Amit Shah) పై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) పై మంగళవారం లోక్‌సభలో గంటన్నరపాటు మాట్లాడిన హోంమంత్రి.. తన హోంశాఖ వైఫల్యం గురించిగానీ, దాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తున్నాననిగానీ ఒక్క మాట కూడా మాట్లడకపోవడం దురదృష్టకరమని అన్నారు.
జమ్ముకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ధైర్యంగా నిజం ఒప్పుకున్నారని గౌరవ్ గొగోయ్ పొగిడారు. భద్రతా వైఫల్యంవల్లే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిందని మనోజ్ సిన్హా పశ్చాత్తాపం వ్యక్తం చేశారని గొగోయ్ చెప్పారు. పండిట్ నెహ్రూ కారణంగానో, యూపీఏ కారణంగానో, రాహుల్‌గాంధీ కారణంగానో, రాజీవ్‌గాంధీ కారణంగానో పహల్గాం ఉగ్రదాడి జరగలేదని, ఆ దాడి కచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యం వల్లే జరిగిందని గొగోయ్ ఆరోపించారు.