Supreme Court | బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే జోక్యం చేసుకుంటాం : సుప్రీంకోర్టు
Supreme Court | కేంద్ర ఎన్నికల సంఘం (ECI) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో బీహార్ ఓటర్ల జాబితా (Bihar voters list) ను సవరిస్తోంది. అయితే ఈ సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని, ఓటు నిలుపుకోవడం కోసం, కొత్తగా ఓటు హక్కు కోసం పౌరులు చూపించాల్సిన డాక్యుమెంట్ల జాబితాలో ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డులను చేర్చలేదని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం (ECI) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో బీహార్ ఓటర్ల జాబితా (Bihar voters list) ను సవరిస్తోంది. అయితే ఈ సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని, ఓటు నిలుపుకోవడం కోసం, కొత్తగా ఓటు హక్కు కోసం పౌరులు చూపించాల్సిన డాక్యుమెంట్ల జాబితాలో ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డులను చేర్చలేదని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
ఓటర్ల జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రిజవిజన్ పేరుతో సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉన్నదని, ఈసీ చట్ట ప్రకారం పని చేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సవరణ లక్ష్యం భారీగా కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడమే ఉండాలిగానీ, భారీగా ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ఉండకూడదని వ్యాఖ్యానించింది. భారీగా ఓట్లు తొలగింపునకు గురైతే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది.
బీహార్ ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారిస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆగస్టు 1న ఎన్నికల కమిషన్ సవరించిన ఓటర్ల జాబితాను ప్రచురించనుందని, పాత జాబితాలో ఉన్న అనేక మంది ఓటర్లను ఈ జాబితా నుంచి తొలగించారని, దాంతో వారంతా తమ ఓటు హక్కును కోల్పోనున్నారని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
దానిపై కోర్టు స్పందిస్తూ.. సవరించిన ఓటరు జాబితాలో ఏవైనా తప్పులను గుర్తిస్తే ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు సూచించింది. మీరు భయపడుతున్నట్లుగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగితే వెంటనే తాము జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చింది. జాబితాలో అవకతవకలు ఉంటే ఆగస్టు 8లోగా పిటిషనర్లు తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. అదేవిధంగా వెరిఫికేషన్ డాక్యుమెంట్ల లిస్టులో ఆధార్‌కార్డుకు, ఓటర్ ఐడీకి చోటు కల్పించాలని ఈసీని ఆదేశించింది.
Read More >>
టెర్రరిస్టుల ఏరివేతలో ఆ రెండు ఆపరేషన్‌లది కీలక పాత్ర : ప్రధాని మోదీ
అరెస్ట్ చేయాల్సింది గూండాలను.. సన్యాసినిలను కాదు.. బీజేపీపై శశిథరూర్ ఫైర్
హోంమంత్రి అమిత్ షా వైఫల్యంవల్లే పహల్గాం ఉగ్రదాడి : గౌరవ్ గొగోయ్
‘వాళ్లు ఎవరో ఏందో నాకైతే తెల్వదు’.. పహల్గాం ఉగ్రవాదుల హతంపై ఫరూఖ్ అబ్దుల్లా
నా చేతులారా వాళ్లను కాల్చి చంపాలనుకునేదాన్ని.. ఉగ్రవాదుల హతంపై పహల్గాం మృతుడి భార్య.. Video
ఛత్తీస్‌గఢ్ భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

