లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కరోనా టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్లో భాగంగా ఆయన ఇవాళ లక్నోలోని సివిల్ హాస్పిటల్లో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనం కరోనా వైరస్ ఏవిధంగా ప్రవర్తిస్తుందనే విషయాన్ని సరిగా గమనించకపోవడంతోనే మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నదని చెప్పారు. కరోనా టీకా ఉచితంగా లభించేలా చేసిన ప్రధాని మోది, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. మన వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా టీకా తీసుకుందామని పిలుపునిచ్చారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath receives first dose of COVID-19 vaccine at Civil Hospital, Lucknow pic.twitter.com/MwpMAUca7K
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 5, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..