బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 12:07:56

వందేభార‌త్ విమానాల‌పై అమెరికా ఆంక్ష‌లు

వందేభార‌త్ విమానాల‌పై అమెరికా ఆంక్ష‌లు

హైద‌రాబాద్‌:  విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు మోదీ స‌ర్కార్ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మిష‌న్‌లో భాగంగా న‌డిపిన ప్ర‌త్యేక విమానాల‌పై అమెరికా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది.  భార‌త్ అవ‌లంబిస్తున్న విధానాలు అనైతికంగా, వివ‌క్ష‌పూరితంగా ఉన్నాయ‌న్న‌ది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న వైమానిక ఒప్పందాల‌ను భార‌త్ ఉల్లంఘిస్తున్న‌ట్లు అమెరికా ఆరోపించింది.

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌మ‌ర్షియ‌ల్ విమాన‌ సేవ‌లు ర‌ద్దు అయ్యాయి. కానీ భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు ఇండియా ప్ర‌త్యేక విమానాల‌ను న‌డిపింది. కానీ అమెరికా విమానాల‌కు మాత్రం భార‌త్ వ‌చ్చే అవ‌కాశం ఇవ్వలేదు. కేవ‌లం ఎయిర్ ఇండియా విమానాలు మాత్రం తిర‌గ‌డం ప‌ట్ల అమెరికా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.  ఈ ప‌రిస్థితి వ‌ల్ల అమెరికా విమానాల ప‌రిస్థితి దిగ‌జారిపోతున్న‌ద‌ని ఆ దేశం ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ ఆరోపించింది. దీని గురించి త్వ‌ర‌లో త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు చెప్పింది.


logo