illegal Indian immigrants | అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 205 మంది భారతీయులతో (illegal Indian immigrants) కూడిన విమానం భారత్‌కు చేరుకుంది. టెక్సాస్ (Texas) నుంచి బయల్దేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 విమానం (US C 17 Military Plane) ఇవాళ మధ్యాహ్నం అమృత్సర్ (Amritsar) విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వచ్చే వారం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. అమెరికాలో మొత్తం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా, అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత భారతీయులే అధికం. ఇప్పటికే ఆ దేశ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు 18 వేల మంది భారతీయుల లిస్టును తయారు చేసినట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది. సుమారు 20,407 మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని, వారిలో 17,940 మందిని పంపించి వేయడానికి జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 2,467 మంది అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవిస్తూ అక్కడి నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు.
Also Read..
Kangana Ranaut | వ్యాపార రంగంలోకి బాలీవుడ్ క్వీన్.. హిమాలయాల్లో కేఫ్
Shantanu Naidu | రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ