Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన మండి (Mandi) లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వ్యాపార రంగంలోకి (restaurant business) అడుగుపెట్టారు. హిమాలయాల్లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ‘ది మౌంటెన్ స్టోరీ’ (The Mountain Story) పేరుతో కేఫ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
Mountain story is a love story ♥️ pic.twitter.com/po9JLtpAhG
— Kangana Ranaut (@KanganaTeam) February 5, 2025
రెస్టారెంట్‌ను ప్రారంభించాలన్నది తన చిన్న నాటి కల అని కంగన తెలిపారు. చివరికి తన కల నెరవేరుతోందని సంతోషం వ్యక్తం చేశారు. సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘నా చిన్ననాటి కల సజీవంగా ఉంది. హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ. ఇదో ప్రేమకథ’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు, పలువురు ప్రముఖులు కంగనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
A childhood dream comes alive.
My little cafe in the lap of Himalayas.
Important announcement coming at 10am. pic.twitter.com/GW4d2BKDPj— Kangana Ranaut (@KanganaTeam) February 5, 2025
View this post on Instagram
A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms)
Also Read..
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Bomb Threats | నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు