Gujarat Rains | గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వర్షం కారణంగా సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో పది మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 168 తాలుకాల్లో సోమవారం అకాల వర్షాలు కురిశాయి. కొన్ని తాలూకాలు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ వర్షం కారణంగా సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. అందులో ఖేడా జిల్లాలో నలుగురు, వడోదర నగరంలో ముగ్గురు, ఆరావళి, దాహోద్ల్లో ఇద్దరు చొప్పున, అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్, దస్క్రోయ్ల్లో ఒక్కొక్కరు, ఆనంద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 16 మంది గాయపడ్డారు. 26 మూగజీవాలు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Also Read..
Mock Drills | కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 259 చోట్ల సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
Boat Capsize: అమెరికాలో బోటు మునక.. ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్
Abdul Basit | మే 10-11 తేదీల్లో పాక్‌పై భారత్ దాడులు.. పాక్ దౌత్యవేత్త సంచలన ట్వీట్