Abdul Basit | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడితో దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ ఎలాంటి ప్రతీకార చర్య చేపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
పాక్‌కు చెందిన దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) సంచలన ట్వీట్ చేశారు. వారం రోజుల్లో పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. రష్యా విక్టరీ డే వేడుకల (Russia Victory Day celebrations) తర్వాతే మే 10-11 మధ్య ఇస్లామాబాద్‌పై భారత్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బాసిత్ భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా పనిచేశారు. ఇక మే 9న రష్యా విక్టరీ డే జరగనున్న విషయం తెలిసిందే.
India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.
— Abdul Basit (@abasitpak1) May 6, 2025
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే పాక్‌కు చెందిన పలువురు మంత్రులు, దౌత్యవేత్తలు భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొన్ని గంటల్లో పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేస్తుందని.. సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఉందని సమాచార మంత్రి అతుల్లా తరార్ గత నెల 30న పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ దేశ దౌత్యవేత్త ఏకంగా భారత్ దాడి చేసే తేదీలను కూడా చెప్పడం గమనార్హం.
Also Read..
Ajit Doval | పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ
Punjab | పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. మందుగుండు సామగ్రి, ఉగ్రవాద హార్డ్వేర్లు స్వాధీనం
Chenab River: చీనాబ్ బంద్.. పాకిస్థాన్ ఖరీఫ్ సీజన్‌కు 21 శాతం నీటి కొరత