Ajit Doval | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడితో దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ ఎలాంటి ప్రతీకార చర్య చేపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్గామ్ ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఇక నిన్న మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ (Rajesh Kumar Singh) సమావేశమయ్యారు. గత నెల 26న జరిగిన రక్షణ సంబంధిత ఉన్నత స్థాయి సమావేశంలో పాక్‌పై చర్యలు తీసుకొనే విషయంలో సాయుధ బలగాలకు మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు రక్షణ సన్నాహకాల్లో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ తన ఉద్యోగులందరికీ సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read..
Balvinder Singh Sahni: భారతీయ బిలియనీర్‌కు దుబాయ్‌లో జైలుశిక్ష.. ఎవరీ బల్విందర్ సింగ్ సహ్ని ?
NTR- NEEL | ఫ్యామిలీస్‌తో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్.. తెగ నవ్వించేస్తున్న జూనియర్
HYDRA | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు..