న్యూఢిల్లీ: భారతీయ వ్యాపారవేత్త బల్విందర్ సింగ్ సహ్ని(Balvinder Singh Sahni)కి దుబాయ్లో అయిదేళ్ల జైలుశిక్ష పడింది. అతనికి కోటి రూపాయల జరిమానా విధించారు. ఆర్ధిక నేరాలకు పాల్పడిన అతన్ని డిపోర్ట్ చేయనున్నారు. మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్ కోర్టు బల్విందర్కు 1.14 కోట్ల జరిమానా విధించింది. బల్విందర్తో పాటు మరో 20 మంది వ్యవస్థీకృత క్రైంలో పాల్గొన్నట్లు తేలింది. సహ్ని కుమారుడికి కూడా ఇదే శిక్ష విధించారు. బల్విందర్కు చెందిన ప్రాపర్టీలతో పాటు సుమారు 344 కోట్ల నిధుల్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
రాజ్ సహ్ని గ్రూపు వ్యవస్థాపకుడు, చైర్మెన్ బల్విందర్ సింగ్ సహ్ని. అతని వయసు 53 ఏళ్లు. ఇదో ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ. అనేక దేశాల్లో ఆ కంపెనీ ఆపరేట్ చేస్తున్నది. ఆర్ఎస్జీ దుబాయ్ ప్రాపర్టీ కింద 24 అంతస్తుల బుర్జ్ సాబా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉన్నది. జుమేరా విలేజ్ సర్కిల్లో ఆ భవంతి ఉన్నది. ఇక దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఖాసర్ సాబాహ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉన్నది.
దుబాయ్ సంపన్నుల సర్కిల్లో సహ్నికి మంచి రిలేషన్ ఉన్నది. ఎప్పుడూ అతను బ్లూ రంగ కండురా, బేస్బాల్ క్యాప్ ధరించి కనిపిస్తుంటారు. అతని వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. తరుచూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ కార్ల ఫోటోలను పోస్టు చేసేవాడు.
2016లో అతను ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సింగిల్ డిజిట్ వెహికల్ లైసెన్స్ ప్లేట్ డీ5 ఖరీదు చేయడానికి అతను 75 కోట్లు చెల్లించాడు. దుబాయ్లో అది అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ అని తేలింది. తన వద్ద ఉన్న లగ్జరీ కార్ల కన్నా.. నెంబర్ ప్లేట్ల ఖర్చే ఎక్కువైందన్నారు.
అతని వద్ద ఉన్న లగ్జరీ కార్లలో బ్లాక్ బుగాటి ఒకటి.