హైదరాబాద్: హైదరాబాద్ హైడ్రా (HYDRA) మరోసారి కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్, ఫుడ్కోర్టులను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. గచ్చిబౌలి సర్వే నంబర్ 124, 127లోని సుమారు 20 ఎకరాల్లో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లేఅవుట్ వేసింది. ఇందులో 162 మంది ప్లాట్స్ కొనుగోలు చేశారు. సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ప్లాట్లు కొనుగోలుచేసినవారు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో వేసిన లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్లు, పార్కును కలుపుతూ సంధ్యా కన్స్ట్రక్షన్ పలు ఆక్రమలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు అనుమతులు లేని కట్టడాలను తొలగించారు.
లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, జీ ప్లస్ 2గా నిర్మించిన 3 ఐరన్ షడ్లను, మినీ హాల్తోపాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను నేలమట్టం చేశారు. ఇంకా పలు నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.