Punjab | పెహల్గామ్ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఆ దాడి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ (Punjab)లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.
పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో అటవీ ప్రాంతం సమీపంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశాయి. భారీగా మందుగుండు సామగ్రి, ఉగ్రవాద వైర్లెస్ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్ (terror hardware seized)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో స్లీపర్ సెల్‌లను పునరుద్ధరించడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుగల క్రాస్-బోర్డర్ టెర్రర్ నెట్‌వర్క్‌ల ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్, కేంద్ర సంస్థల సమన్వయంతో రెండు రాకెట్-ప్రొపెల్డ్ గ్రనేడ్లు (ఆర్పీజీలు), రెండు ఇంప్రూవైజ్జ్ పేలుడు పరికరాలు (ఐఈడీలు), ఐదు పి-86 హ్యాండ్ గ్రనేడ్లు, వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని (Terrorist Hideout) భద్రతా బలగాలు ధ్వంసం చేసి..పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read..
Ajit Doval | పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ
Chenab River: చీనాబ్ బంద్.. పాకిస్థాన్ ఖరీఫ్ సీజన్‌కు 21 శాతం నీటి కొరత
UN Security Council: లష్కరే పాత్ర ఉందా? పాకిస్థాన్‌ను నిలదీసిన యూఎన్ భద్రతా మండలి