శనివారం 11 జూలై 2020
National - Jun 20, 2020 , 15:07:14

అన‌వ‌స‌ర వివాదం సృష్టిస్తున్నారు: కేంద్రం

అన‌వ‌స‌ర వివాదం సృష్టిస్తున్నారు:  కేంద్రం

హైద‌రాబాద్‌:  గాల్వ‌న్ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి మోదీ నేతృత్వంలో శుక్ర‌వారం అఖిల ప‌క్ష భేటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సైనికుల మ‌నోభావాలు దెబ్బ‌తినేవిధంగా .. అన‌వ‌స‌ర వివాదం సృష్టిస్తున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలియజేసింది. వాస్త‌వాధీన రేఖ‌(లైణ్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్‌) హ‌ద్దుల్ని ఎట్టి ప‌రిస్థితుల్లో మార్చేది లేద‌ని ప్ర‌ధాని అఖిల‌ప‌క్ష భేటీలో స్ప‌ష్టం చెప్పిన‌ట్లు పీఎంవో వెల్ల‌డించింది.

భార‌త భూభాగాన్ని.. చైనాకు అప్ప‌గించిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఆరోపించారు.  ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ  ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. భార‌త భూభాగంలోకి చైనా సైనికులు రాలేద‌ని, ఒక‌వేళ అలాంటి సాహ‌సం చేస్తే వారిని త‌రిమికొడుతామ‌ని నిన్ననే ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు.  అయితే రాహుల్ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో.. అఖిల ప‌క్ష భేటీలో ప్ర‌ధాని మాట్లాడిన విష‌యాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి ఆ ప్ర‌క‌ట‌న‌లో సుస్ప‌ష్టం చేసింది. జాతీయ విప‌త్తు స‌మ‌యంలో సైన్యానికి మద్దత్తుగా నిలుస్తామ‌ని అఖిల ప‌క్షం ఆమోదించింద‌ని, కొంద‌రి ప్రేరేపిత వ్యాఖ్య‌ల‌తో భార‌తీయ ఐక్య‌త విచ్ఛిన్నం కాదు అని న‌మ్ముతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. 


logo