train collision | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి (Union Railways Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు నష్టపరిహారాన్ని (compensation) ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి నష్టపరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు (ఒక్కొక్కరికి), స్వల్పంగా గాయపడిన బాధితులకు రూ.50 వేలు నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
On West Bengal train accident, Railways Minister Ashwinin Vaishnaw says, “Enchanced ex-gratia compensation will be provided to the victims – Rs 10 lakhs in case of death and Rs 2.5 lakhs towards grievous and Rs 50,000 for minor injuries.” pic.twitter.com/Xog90JPccJ
— ANI (@ANI) June 17, 2024
అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (Kanchanjunga Express) రైలును న్యూజల్పాయ్ గుడి జంక్షన్ సమీపంలోని రంగపాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Kanchanjunga Express: సిగ్నల్ ఓవర్‌షాట్ కావడం వల్ల రైలు ప్రమాదం !