కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలును వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, సుమారు 60 మంది గాయపడ్డారు. అయితే సిగ్నల్ ఓవర్‌షాట్ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతా సమీపంలోని సీల్దాకు వెళ్తున్న సమయంలో.. రంగపాని స్టేషన్ వద్ద దుర్ఘటన జరిగింది. కాంచనజంగా రైలుకు చెందిన మూడు బోగీలు డిరేల్ అయ్యాయి.
కోల్‌కతా-సీల్దా రూట్లో ఆటోమెటిక్ సిగ్నల్ వ్యవస్థ ఉన్నది. అయితే ఈ రూట్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. పాపులర్ హిల్ స్టేషన్ డార్జిలింగ్ కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఉంటుంది. రైలు ప్రమాదంలో గూడ్స్ రైలు లోకోపైలెట్, అతని అసిస్టెంట్‌తో పాటు కాంచనజంగా రైలు గార్డు మృతిచెందారు. పది రైళ్లను దారి మళ్లించారు. సిగ్నల్ ఓవర్‌షాట్ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అంటే సిగ్నల్ వ్యవస్థలో ఒక్కసారిగా వోల్టేజ్ పెరగడంతో.. సిగ్నల్ మారి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మానవ తప్పిందం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, సిగ్నల్‌ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్బే బోర్డు సీఈవో జయా వర్మ సిన్హా తెలిపారు. రైల్వే కోచ్‌ల్లో కవచ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్ రైళ్లలోనూ ఆ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
West Bengal train accident | “8 deaths, 25 injured in this accident. Prima facie suggests human error as the cause. The first indications suggest that this is a case of signal disregard. Kavach needs to proliferated, planned for West Bengal,” says Jaya Varma Sinha, Chairman & CEO… pic.twitter.com/uUnP92wErs
— ANI (@ANI) June 17, 2024