రామగిరి, జనవరి 06 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాల 1, 3, 5 సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను మంగళవారం వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల రవి, సీవోఈ డా.జి.ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. ప్రథమ సెమిస్టర్లో 8,295 మంది హాజరు కాగా 1,808 మంది ఉత్తీర్ణత సాధించారు. 8,474 మంది ప్రమోట్ కాగా 15 మంది ఫలితాలు మాల్ ప్రాక్టీస్‌లో ఉంచగా 21.77 శాతం ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా మూడవ సెమిస్టర్లో 5,834 మంది హాజరు కాగా 1,583 మంది ఉత్తీర్ణత సాధించారు. 4,257మంది ప్రమోట్ కాగా 8 మంది ఫలితాలు మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 28.83 శాతం ఫలితాలు వచ్చాయి. 5వ సెమిస్టర్లో 5,588 మంది హాజరు కాగా 2,108 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,478 మంది ప్రమోట్ కాగా 1 విద్యార్థి ఫలితం మాల్ ప్రాక్టీస్‌లో ఉంచగా 37.78 శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో ఉందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డైరెక్టర్ ప్రొ.ఆకుల రవి, అసిస్టెంట్ సీవోఈలు డా. లక్ష్మీప్రభ, డా. కళ్యాణి, డా. ప్రవళి, డా.భిక్షమయ్య పాల్గొన్నారు.