Dhanush | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ ధనుష్ (Dhanush),ఆనంద్ ఎల్ రాయ్ (Aanand L Rai). ధనుష్ ఇప్పటికే ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో రాంఝానా, అట్రాంగి రే సినిమాల తర్వాత మూడో సినిమా Tere Ishq Mein కూడా చేయగా.. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
కాగా ఇప్పుడు ఈ ఇద్దరూ నాలుగోసారి కలిసి పనిచేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. హృదయాలను కదిలించే ప్రేమకథలతో ఆకట్టుకోవడం ఆనంద్ ఎల్ రాయ్ స్పెషాలిటీ. ఈ క్రేజీ డైరెక్టర్ ధనుష్‌తో ఓ రొమాంటిక్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండబోతుందని జోరుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఏం లేకున్నా.. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై పీరియాడిక్ అడ్వెంచర్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారనుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుపై ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి.
ధనుష్ ప్రస్తుతం విఘ్నేశ్ రాజా డైరెక్ట్ చేస్తున్న డీ54లో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?