కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శనివారం గ్రూపు-బీలో భాగంగా ఒమన్‌తో జరిగిన పోరులో ఐర్లాండ్ 96 పరుగుల తేడాతోఘన విజయం సాధించింది. కెప్టెన్ లోర్కాన్ టకర్(51 బంతుల్లో 94 నాటౌట్, 10ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు ఆఖర్లో డెల్నె(30 బంతుల్లో 56, 3ఫోర్లు, 4సిక్స్‌లు) రాణించడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 235/5 భారీ స్కోరు చేసింది.
ఐదో వికెట్‌కు టకర్, డెల్నె 101 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. షకీల్ అహ్మద్(3/33) మూడు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో ఒమన్..18 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. లిటిల్(3/16), మాథ్యూ హ్యాంప్రె(2/27), మెక్‌కార్తీ(2/32) ధాటికి ఒమన్ కోలుకోలేకపోయింది.