కోల్‌కతా: మెగాటోర్నీలో ఇంగ్లండ్ గెలుపు బాట పట్టింది. శనివారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై గెలిచింది. స్కాటిష్ టీమ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బాంటన్(41 బంతుల్లో 63, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. టాపార్డర్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్(2), బట్లర్(3) మరోమారు ఘోరంగా విఫలం కాగా, జాకబ్ బెతెల్(32)తో కలిసి బాంటన్ జట్టు విజయంలో కీలకమయ్యాడు.
వీరిద్దరు కలిసి స్కాట్లాండ్ బౌలింగ్‌ను నిలువరిస్తూ మూడో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్సన్, బ్రాడ్ క్యూరీ ఒక్కో వికెట్ తీశారు. తొలుత కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49), జోన్స్(33) రాణించడంతో స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులు చేసింది. రషీద్(3/36)మూడు వికెట్లు తీశాడు.