గోరఖ్‌పూర్: బీజేపీ పాలిత ఢిల్లీలో వాయు నాణ్యతను ఆ పార్టీకే చెందిన యూపీ సీఎం యోగి గ్యాస్ చాంబర్‌తో పోల్చారు. తమ రాష్ట్రంలో ప్రజలు ఎటువంటి కాలుష్యంలేని స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందుతున్నారని చెప్పారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ప్రస్తావించారు. ‘ఢిల్లీలో పరిస్థితి చూడండి. అదో గ్యాస్ చాంబర్‌లా తయారైంది. అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతున్నది. కండ్లల్లో మంటలు పుడుతున్నాయి. ఇంటిపట్టునే ఉండాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదేం బతుకు’ అంటూ యోగి ఆందోళన వ్యక్తం చేశారు.