Talasani Srinivas Yadav | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది జెన్ జీ విద్యార్థులు సాధించిన చారిత్రాత్మక విజయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నీట్ స్కాం లీకేజీ వ్యవహారంలో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ మూడు డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమిస్తున్నట్టు సీజీపీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం సీజీపీ నేతలను చర్చలకు కూడా ఆహ్వానించింది.
ఈ నేపథ్యంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. తరం మారింది.. దేశ యువతరం మేల్కొందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు చేసిన ఈ పోరాటంతో, తీవ్ర అణిచివేతకు పాల్పడిన కేంద్రంలోని అరాచక బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. విద్యార్థుల వైపే న్యాయం ఉందనే నమ్మకంతో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను కూడా పక్కన బెట్టి, వేలాది మంది ‘జెన్ జీ’ యువత కోసం అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
సమాజంలో పెను మార్పు తీసుకురావడానికి కృషి చేసి, విజయాన్ని సాధించిన విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది
జెన్ జీ విద్యార్థులు సాధించిన చారిత్రాత్మక విజయం.తరం మారింది.. దేశ యువతరం మేల్కొంది.
ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు చేసిన ఈ పోరాటంతో,
తీవ్ర అణిచివేతకు పాల్పడిన కేంద్రంలోని
అరాచక బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చింది.విద్యార్థుల వైపే న్యాయం… pic.twitter.com/Sio6UaxTTi
— BRS Party (@BRSparty) July 25, 2026