Team India : అంతర్జాతీయంగా పొట్టి క్రికెట్‌ను భారత జట్టు(Team India) ఏలుతోంది. ఆరంభ సీజన్(2007) టీ20 వరల్డ్‌కప్‌ను.. ఆపై వరసగా రెండుపర్యాయాలు (2024, 2026) విజేతగా నిలిచిన టీమిండియా.. రికార్డుస్థాయిలో రెండొందల స్కోర్లు బాదేసింది. శనివారం జింబాబ్వేపై 219 రన్స్ చేయడం ద్వారా మరే జట్టుకు సాధ్యమవ్వని రికార్డును పట్టేసింది మెన్ ఇన్ బ్లూ. వరసగా మూడు సంవత్సరాలలో 9 సార్లు రెండొదలపైన స్కోర్ చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
పురుషుల టీ20ల్లో తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది టీమిండియా. స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ విజయంతో తన ఆధిపత్యాన్ని చాటిన భారత్.. వరసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో పొట్టి సిరీస్‌లు కోల్పోయినా మళ్లీ పుంజుకుంది. జింబాబ్వే పర్యటనను విజయంతో ఆరంభించిన శ్రేయాస్ అయ్యర్ సేన రెండో మ్యాచ్‌లో 219 పరుగులు చేసింది. తద్వారా ఈ ఫార్మాట్లో అత్యధికంగా 52 సార్లు రెండొందలకు పైగా చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికా(South Africa) 29 రెండో స్థానంలో కొనసాగుతోంది.
🚨 𝟐𝐧𝐝 𝐓𝟐𝟎𝐈 𝐈𝐍𝐃𝐈𝐀 𝐯𝐬 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 🚨
INDIA 🇮🇳 2️⃣1️⃣9️⃣-5️⃣ (20) against ZIMBABWE 🇿🇼 | CRR : 10.95
Ishan Kishan : 81 (44)
Tilak Varma* : 60 (29)Newman Nyamhuri : 1-22 (3)
ZIMBABWE 🇿🇼 NEED 2️⃣2️⃣0️⃣ RUNS TO WIN#INDvsZIM #ZIMvIND #T20I pic.twitter.com/OzbAq4jzcv
— Cricket Lover 🏏 (@Crick97924Lover) July 25, 2026
అంతేకాదు.. ఈ ఫార్మాట్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో మూడేళ్లలో ఏకంగా ఏడుకు పైగా సందర్భాల్లో 200 ప్లస్ కొట్టిన ఏకైక జట్టు భారతే. తొలిసారిగా 2023లో ఏడుదఫాలు రెండొందలకుపైగా స్కోర్ నమోదు చేసిన టీమిండియా.. 2024లో ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచుకుంది. 2026లోనూ అదే జోరు చూపించిన భారత్.. మరో ఐదు నెలలకు ఉండగానే 9 పర్యాయాలు 200 ప్లస్ స్కోర్‌తో ప్రత్యర్థి జట్లను భయపెట్టింది.
Team India is rewriting the T20 record books! 🔥
India has now registered the most 200+ totals in a calendar year in T20 cricket, breaking its own record with plenty of matches still to come. 💪📈
Records are made to be broken… and India is breaking its own! 🇮🇳🔥#TeamIndia… pic.twitter.com/t2oXmn70Q3
— Sports Yaari (@YaariSports) July 25, 2026
టీమిండియా అనంతరం పసికూన జపాన్(2024లో) మేటి జట్టైన ఆస్ట్రేలియా(2025లో) మాత్రమే ఒక ఏడాదిలో ఏడుసార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాయి. రెండుసార్లు ఛాంపియన్లు ఇంగ్లండ్(2022లో), వెస్టిండీస్(2024లో), దక్షిణాఫ్రికా(2022లో)లు ఒక ఏడాది మాత్రమే ఆరు సందర్భాల్లో రెండొందల స్కోర్ నమోదు చేశాయి.
