రైస్ మిల్లు భారి నుండి కాపాడండి..!
హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నందు గల శ్రీలక్ష్మి నరసింహ గణేష్ ఫార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లు నుండి విపరీతమైన బూడిద, పొట్టు, కాలుష్యం ఉత్పన్నమౌతుందని, యజమాన్యం నింబంధనలకు వ్యతిరేకంగా పొట్టు గది, సరైన బూడిద గది లేకుండా...
హుజూర్నగర్, జూలై 25 : హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నందు గల శ్రీలక్ష్మి నరసింహ గణేష్ ఫార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లు నుండి విపరీతమైన బూడిద, పొట్టు, కాలుష్యం ఉత్పన్నమౌతుందని, యజమాన్యం నింబంధనలకు వ్యతిరేకంగా పొట్టు గది, సరైన బూడిద గది లేకుండా బహిరంగంగా వదులుతూ ప్రజల ఆరోగ్యలతో చెలగాటంతో ఆడుతుందని పరిసరాల కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ -మిర్యాలగూడ రాకపోకలు చేసే వివిధ వాహనదారులు కూడా కళ్లల్లో బూడిద పడి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక సార్లు రోడ్డు ప్రమాదాల భారిన సైతం పడుతున్నట్లు చెప్పారు. మిల్లుకు కనీసం ప్రహరీ కూడా లేదన్నారు. 15 రోజుల క్రితం బాధిత ప్రాంతాల ప్రజలు పురపాలక సంఘం కమిషనర్ సతీష్ కు ఫిర్యాదు చేస్తే ఆయన మిల్లును సందర్శించి పలు సూచనలు చేసి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
అయినా మిల్లు యజమాని ఆ సూచనలను ఏమాత్రం లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా మిల్లును నడుపుతూ కాలుష్యం వెదజల్లుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై శనివారం పరిసరాల కాలనీ వాసులు మిల్లు జయమానిని నిలదీశారు. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి వచ్చి నింబంధనలకు విరుద్దంగా మిల్లు నడపటం సరైంది కాదని, 15 రోజుల్లో అన్నీ నివారణ చర్యలు తీసుకోవాలని మిల్లు యజమాని చెప్పి కాలుష్య బాధితులను శాంతపరిచి అక్కడనుండి పంపించారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, నాగేశ్వరరావు, ఆంజనేయులు, లాలయ్య, నరసింహ, శంకర్ రావు, బుజ్జి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

