హనుమకొండ చౌరస్తా: కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 16 వరకు నిర్వహించనున్న ఎన్.ఈ.పి. ఓరియంటేషన్ అండ్ సెన్సిటైజేషన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం ఆవిష్కరించారు.
ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 8.15 నిమిషాల వరకు జూమ్ వేదికగా ఢిల్లీ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీలు, ఎస్.జి.టి.బి కాలేజీ కోర్ టీంగా కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసి విభాగం ప్రొఫెసర్ బి.నాగరాజు, డాక్టర్ షాయేదా సంయక్తంగా, వివిధ అంశాలపై నిర్వహిస్తున్నారు.
జాతీయస్థాయి నిపుణులచే ఇండియన్ నాలెడ్జ్ సిస్టం, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అకాడమిక్ లీడర్ షిప్, గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ లాంటి అంశాలపై, విశ్వవిద్యాలయ బోధనా సిబ్బందికి ఓరియంటేషన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాగరాజు, షాయేదా తెలిపారు. మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడవచ్చని వారు తెలిపారు.
కేయూ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
హనుమకొండ చౌరస్తా :కాకతీయ విశ్వవిద్యాలయ 2026 డైరీ, క్యాలెండర్‌ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూజీసీ కో-ఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇన్చార్జి ఫైనాన్సు ఆఫీసర్లు మహమ్మద్ హబీబుద్దిన్, డిప్యూటీ రిజిస్ట్రార్ అండ్ పబ్లికేషన్ సెల్ సంచాలకులు
ఎం.నరసింహరావు, డిప్యూటీ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, ప్రజాసంబంధాల అధికారి వల్లాల పృథ్వీరాజ్ పాల్గొన్నారు.