Assam | వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన అస్సాం ప్రభుత్వం.. ఇకపై ప్రభుత్వ అధికారులు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే
Assam | వీఐపీ సంస్కృతికి (VIP culture) స్వస్తి పలుకుతూ అస్సాం ప్రభుత్వం (Assam Government) కీలక నిర్ణయం ప్రకటించింది.
Assam | వీఐపీ సంస్కృతికి (VIP culture) స్వస్తి పలుకుతూ అస్సాం ప్రభుత్వం (Assam Government) కీలక నిర్ణయం ప్రకటించింది. జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బుతోనే చెల్లించుకోవాల్సి (Officials To Pay Power Bills) ఉంటుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) స్పష్టం చేశారు. తాను, ప్రధాన కార్యదర్శి జులై 1వ తేదీ నుంచి తమ విద్యుత్ బిల్లులను తామే చెల్లిస్తామని ప్రకటించారు.
‘ప్రజలు చెల్లించే టాక్స్‌తో ప్రభుత్వ అధికారులకు విద్యుత్ బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాం. నేను, ప్రభుత్వ కార్యదర్శి మా విద్యుత్ బిల్లులను జులై 1వ తేదీ నుంచి మేమే చెల్లిస్తాం. ఇలాగే జులై 2024 నుంచి ప్రభుత్వ ఉద్యోగులంతా తమ విద్యుత్ బిల్లులను వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
We are ending the #VIPCulture rule of paying electricity bills of Government officials using tax payer money.
Myself and the Chief Secretary will set an example and start paying our power bills from July 1 onwards.
Beginning July 2024, all public servants will have to pay… pic.twitter.com/kJMoYETQLJ
— Himanta Biswa Sarma (@himantabiswa) June 16, 2024
గువాహటిలోని రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ వేడుకలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల గ్రిడ్ – కనెక్ట్ రూఫ్‌టాప్, గ్రౌండ్ – మౌంటెడ్ సోలార్ పీవీ సిస్టమ్, జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్‌ను సీఎం ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం హిమంత చెప్పారు. ‘ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ పవర్‌ను దశలవారీగా వినియోగించుకోవాలి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌరవిద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలి. విద్యుత్‌ను ఆదా చేయడానికి ముఖ్యమంత్రి సచివాలయం, హోం, ఆర్థిక శాఖలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రి 8 గంటలకు విద్యుత్‌ను ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే 8 వేల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తున్నాం’ అని సీఎం హిమంత వివరించారు.
మరోవైపు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం వల్ల అస్సాం సెక్రటేరియట్ కాంప్లెక్స్ రోజువారీ వినియోగం కోసం పూర్తిగా సోలార్-ఉత్పత్తి విద్యుత్‌పై ఆధారపడే దేశంలోనే మొట్టమొదటి సివిల్ సెక్రటేరియట్‌గా అవతరించనుంది. ఈ ప్రాజెక్ట్ నెలవారీ సగటున 3 లక్షల యూనిట్ల విద్యుత్‌ను అందిస్తుంది. ఇందుకోసం పెట్టిన రూ.12.56 కోట్ల పెట్టుబడి మొత్తం 4 సంవత్సరాల్లో తిరిగి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నెలవారీ పొదుపు సుమారు రూ.30 లక్షలు అని తెలిపారు.
Also Read..
train collision | బెంగాల్ రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
train collision | రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీలు.. 15 మంది మృతి
VK Sasikala | సమయం ఆసన్నమైంది.. నా రీఎంట్రీ మొదలైంది : వీకే శశికళ కీలక ప్రకటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

