VK Sasikala | సమయం ఆసన్నమైంది.. నా రీఎంట్రీ మొదలైంది : వీకే శశికళ కీలక ప్రకటన
VK Sasikala | తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha) నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే (AIADMK ) పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
VK Sasikala | తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha) నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే (AIADMK ) పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని అన్నారు. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామన్నారు.
ప్రతిపక్ష నేత హోదాలో ఎడప్పాడి కె.పళనిస్వామి.. ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు అడగడంలేదని వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో శశికళ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను మీకు చెబుతున్నా.. సమయం ఆసన్నమైంది. ఎటువంటి ఆందోళనా అవసరం లేదు. తమిళనాడు ప్రజలు కచ్చితంగా మావైపే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దు. నా రీ ఎంట్రీ ప్రారంభమైంది’ అని తెలిపారు.
కార్యకర్తల పార్టీ అన్నాడీఎంకే అని వీకే శశికళ అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అలాంటిది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరని ఆమె వ్యాఖ్యానించారు. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయ్యి ఉండేవారు కాదని అన్నారు. అందరినీ ఏకం చేసి అన్నాడీఎంకే పార్టీని బలోపేతం చేయడే తన లక్ష్యం అని తెలిపారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు.
Also Read..
Human Finger | ఐస్క్రీమ్లో మనిషి బొటనవేలు.. ఆ కంపెనీ లైసెన్స్ రద్దు
Encounter | బండిపొరాలో ఎన్కౌంటర్.. ముష్కరుడు హతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

