శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బండిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాది హతమయ్యాడు. బండిపొరాలోని అరాగామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది. దీంతో ఆదివారం రాత్రి స్థానిక పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మృతిచెందిన ఉగ్రవాదిని ఇంకా గుర్తించాల్సి ఉన్నదని వెల్లడించారు.
కాగా, గత రెండు వారాల్లో జమ్ముకశ్మీర్‌లోని రియాసి, కతువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. టెర్రరిస్టుల కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. వారిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా ఉన్నారు. భద్రతా బలగాలు ఇద్దరు ముష్కరులను అంతమొందించాయి.
#WATCH | Jammu & Kashmir: Bandipora area cordoned off and search operation underway, after gunshots were heard in the forest area of Aragam Bandipora district, yesterday. More details are awaited pic.twitter.com/TvGBDbBmQK
— ANI (@ANI) June 17, 2024