హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటీటి? అని అధికార టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్పై దురుసుగా మాట్లాడారు.
కేసీఆర్ తనకంటే జూనియర్ అని, నాడు మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టారని ఆరోపించారు. అధికారం లేకపోవడం వల్లనే చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నదికి దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణకు అనుమతి ఉన్నంతవరకు ప్రాజెక్టులు కట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.