రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సర్వసాధారణమని, 2029 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధీమావ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం హరీశ్‌రావును కలిశారు.
- బీఆర్ఎస్ కౌన్సిలర్లను అభినందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి, ఫిబ్రవరి 23: ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సర్వసాధారణమని, 2029 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధీమావ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం హరీశ్‌రావును కలిశారు. కొత్తగా విజయం సాధించిన కౌన్సిలర్లను మాజీ మంత్రి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు నిరుత్సాహపడొద్దన్నారు. 2029 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు పోరాడి ఓడిన అభ్యర్థులను కూడా అభినందిస్తూ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రజ ల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

