రాజ్ ప్రేమలో సాంత్వన
నాగచైతన్యతో విడాకుల అనంతరం దాదాపు నాలుగేళ్ల పాటు సమంత జీవితం అనేక ఒడిదుడుకులతో సాగింది. ముఖ్యంగా అరుదైన మయోసైటిస్ వ్యాధి బారిన పడటం అశనిపాతంలా మారింది. అయితే ఈ కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది సమంత.
నాగచైతన్యతో విడాకుల అనంతరం దాదాపు నాలుగేళ్ల పాటు సమంత జీవితం అనేక ఒడిదుడుకులతో సాగింది. ముఖ్యంగా అరుదైన మయోసైటిస్ వ్యాధి బారిన పడటం అశనిపాతంలా మారింది. అయితే ఈ కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది సమంత. మిత్రులు, శ్రేయోభిలాషుల అండతో తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చింది. గత ఏడాది దర్శకనిర్మాత రాజ్ నిడిమోరుతో రెండో వివాహం తర్వాత నూతనోత్తేజంతో కనిపిస్తున్నది సమంత.
ఈ నేపథ్యంలో విడాకుల అనంతరం తన మానసిక పరిస్థితి గురించి, రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి తర్వాత పొందిన సాంత్వన గురించి సమంత సోషల్మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ‘విడాకుల అనంతరం ఒక్కసారిగా జీవితమంతా శూన్యంలా అనిపించింది. ఇకముందు ఒకరిపై ఆధారపడి జీవితాన్ని కొనసాగించొద్దనే నిర్ణయానికొచ్చాను. కానీ విధి మరోలా తలచింది.
రాజ్తో స్నేహం, అతను పంచిన ప్రేమాభిమానాలు నాకు కొత్త జీవితాన్ని పరిచయం చేశాయి. అతని సాంగత్యంలో ఇప్పుడు మరింత ఉన్నతమైన వ్యక్తిగా పరివర్తన చెందాను’ అని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. సమంత తెలుగులో నటిస్తూ నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ మే 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

