Human Finger | ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటనవేలు.. ఆ కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఆ ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సు రద్దయింది. ఈ నెల 12న ముంబైలో మలద్ ప్రాంతానికి చెందిన బ్రెండన్ ఫిర్రావ్ అనే వైద్యుడు ఆన్లైన్లో యమ్మో కంపెనీకి చెందిన కోన్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు.
ముంబై: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఆ ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సు రద్దయింది. ఈ నెల 12న ముంబైలో మలద్ ప్రాంతానికి చెందిన బ్రెండన్ ఫిర్రావ్ అనే వైద్యుడు ఆన్లైన్లో యమ్మో కంపెనీకి చెందిన కోన్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. దీనిని తెరిచి తింటుండగా గట్టిగా ఉన్న ఒక పదార్థం నోట్లోకి వచ్చింది. మొదట అది ఐస్‌క్రీమ్‌లో ఉండే డ్రైఫ్రూట్స్‌కు చెందిన ఏదైనా పలుకు అని భావించాడు. కానీ, అనుమానించి బయటకు ఊసి చూడగా గోరుతో ఉన్న చిన్న మాంసపు ముక్క కనిపించింది.
ఇది చూడగానే ఫిర్రావ్ భయాందోళనకు గురయ్యారు. వైద్యుడైన అతడు ఈ మాంసపు ముక్క మనిషి బొటనవేలిగా గుర్తించి షాక్ తిన్నారు. ఈ విషయమై కంపెనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో ఈ మాంసపు ముక్కను ఒక ఐస్ బ్యాగ్‌లో వేసుకొని మలద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన ఆ ఐస్‌క్రీమ్ తయారీదారుని లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఆ కంపెనీని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తనిఖీ చేశారని, అక్కడ నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

