తిరుపతి : మారిషస్ దేశ అధ్యక్షుడు ( Mauritius President) ధరమ్ బీర్ గోగుల్ తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని (Tiruchanur Goddess) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మారిషస్ అధ్యక్షుడికి టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ధరమ్ బీర్ గోగుల్కు జేఈవో తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సీవీఎస్వో కె.వి.మురళీకృష్ణ, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్నస్వామివారిని 82,022 మంది భక్తులు దర్శించుకోగా 20,230 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి బుధవారం శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.48 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.