train collision | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రైళ్లు ఢీ కొన్న (train collision) ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
President Droupadi Murmu tweets, “The news of the loss of lives due to a train accident in Darjeeling, West Bengal is deeply distressing. My thoughts and prayers are with the bereaved families. I pray for the speedy recovery of the injured and success of relief and rescue… pic.twitter.com/YudH9lPeHk
— ANI (@ANI) June 17, 2024
మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం విచారం వ్యక్తం చేశారు. ‘పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు సహాయం చేయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
“The railway accident in West Bengal is saddening. Condolences to those who lost their loved ones. I pray that the injured recover at the earliest. Spoke to officials and took stock of the situation. Rescue operations are underway to assist the affected. The Railways Minister… pic.twitter.com/fGrWJZsyiC
— ANI (@ANI) June 17, 2024
అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (Kanchanjunga Express) రైలును న్యూజల్పాయ్ గుడి జంక్షన్ సమీపంలోని రంగపాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
Also Read..
train collision | రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీలు.. 15 మంది మృతి
VK Sasikala | సమయం ఆసన్నమైంది.. నా రీఎంట్రీ మొదలైంది : వీకే శశికళ కీలక ప్రకటన