Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రవర్తన ఆసక్తకిరంగా మారింది. గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో హెడ్లైన్స్లోకెక్కిన యూఎస్ అధ్యక్షుడు, ఇప్పుడు తన విచిత్ర ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ స్టేజ్‌పై బైడెన్ కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ (freezes) అయిపోయారు. ఎలాంటి చలనం లేకుండా స్టేజ్‌పై విగ్రహంలా నిల్చుండిపోయారు. ఇది గమనించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama).. బైడెన్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
శనివారం లాస్ఏంజెల్స్ (Los Angeles)లో జరిగిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పీకాక్ థియేటర్లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెల్ (funnyman Jimmy Kimmel)తో 45 నిమిషాల పాటు సరదాగా ఇంటర్వ్యూ జరిగింది. అనంతరం స్టేజ్‌పై ఉన్న బైడెన్, ఒబామా అక్కడున్న వారికి అభివాదం చూస్తూ కనిపించారు. ఆ సమయంలో బైడెన్ దాదాపు 10 సెకన్లపాటు నిశ్చలంగా నిల్చుండిపోయారు. ఆయనలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించిన బరాక్ ఒబామా.. బైడెన్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి నడిపించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడున్న కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ బైడెన్ ప్రవర్తన ఆసక్తికరంగా మారింది.
🔥🚨DEVELOPING: President Obama had to guide Joe Biden off the stage with Jimmy Kimmel at Biden’s fundraising event in The Hamptons with George Clooney. pic.twitter.com/5OoWVhajOl
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 16, 2024
నేతలంతా ఓవైపు.. బైడెన్ మరోవైపు..
కాగా, ఇటీవలే బైడెన్ ప్రవర్తనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. గత వారం ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన బైడెన్.. అక్కడ గమ్మత్తుగా ప్రవర్తించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ఓ స్టేజ్‌పై కలిసేందుకు వెళ్లిన ఆయన.. ఆ నేతను హగ్ చేసుకున్న తర్వాత.. చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయారు. కన్ఫ్యూజన్లో ఉన్న బైడెన్.. ఇటలీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉన్నది.
Biden appears confused as he SALUTES Italian Prime Minister Giorgia Meloni and then walks off at the G7 Summit.
— Oli London (@OliLondonTV) June 13, 2024
ఇక మరో వీడియోలో బైడెన్ ఎంత గందరగోళానికి గురవుతున్నారో స్పష్టమైంది. జీ7 సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కడే మరో వైపు వెళ్లిపోయారు. కొన్ని ఫీట్ల దూరం వెళ్లిన తర్వాత ఆయన ఎవరూ లేని దిశకు థమ్స్ అప్ చూపించారు. మనుషులు లేని దిక్కుకు వెళ్లి బైడెన్ ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియడంలేదు. కానీ ఆ సమయంలో ఇటలీ ప్రధాని మెలానీ త్వరగా తేరుకుని.. బైడెన్ వద్దకు వెళ్లి ఆయన్ను గ్రూప్ నేతలకు దగ్గరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆగ్రూప్ ఫోటోలకు ఫోజు ఇచ్చింది.
Completamente buena persona Giorgia Meloni reorientando a Joe Biden con sutileza para la foto.
Los democratas son unos hijosdeputa, dejen a este señor vivir en paz el tiempo que le queda. Dejen de usarlo.pic.twitter.com/MGMBGMh8aE
— Traductor 🥹💕💐 (@TraductorTeAma) June 13, 2024
జో బైడెన్ ఆరోగ్యంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇటీవల శ్వేతసౌధంలో మ్యూజికల్ పర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలోనూ బైడెన్ ఎటూ కదలకుండా చలనం లేని రీతిలో నిలుచుండిపోయారు. దీన్ని రిపబ్లికన్లు తప్పుపట్టారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బైడెన్ మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారు. అధ్యక్షుడి నడక కూడా కాస్త మారినట్లుగా వీడియోల్లో స్పష్టమవుతోంది. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా ఐహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వయసు సంబంధిత సమస్యలతో బైడెన్ బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
బైడెన్ జ్ఞాపకశక్తిలో లోపాలు..
వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఓ నివేదిక విడుదలైన విషయం తెలిసిందే. అధ్యక్షుడి జ్ఞాపకశక్తి చాలా ‘మసక’గా, ‘మబ్బు’గా ఉందని నివేదిక పేర్కొంది. జీవితంలో కీలక సంఘటనలను కూడా ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయం కూడా అధ్యక్షుడికి గుర్తుకు రాలేదని పేర్కొంది. అయితే ఈ నివేదికను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.
Also Read..
Vignesh Shivan | తన ఇద్దరు పిల్లలతో.. బాహుబలి సీన్‌ను రీక్రియేట్ చేసిన విఘ్నేశ్ శివన్
Kanchanjunga Express | కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్స్.. చెల్లాచెదురుగా బోగీలు.. ఫొటోలు
train collision | రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీలు.. ఐదుగురు మృతి