UPWW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో మరో ఉత్కంఠ పోరు. కానీ, ఈసారి ఛేజింగ్ టీమ్‌కు నిరాశే మిగిలింది. హోరాహోరీగా సాగిన తొలి డబుల్ హెడర్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants )10 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌కు షాకిచ్చింది. భారీ స్కోర్లు నమదైన ఈ మ్యాచ్‌లో ఫొబే లిచ్‌ఫీల్డ్(78) అర్ద శతకంతో పోరాడినా డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. చివర్లో ఆశా శోభన(27 నాటౌట్) వరుసగా 6, 4 తో భయపెట్టినా యూపీ జట్టుకు ఓటమి తప్పలేదు.
నాలుగో సీజన్ డబ్ల్యూపీఎల్ అంచనాలకు తగ్గట్టే ఉత్కంఠగా, ఆసక్తిగా సాగుతోంది. తొలిపోరులో చివరి బంతికి ఆర్సీబీ గెలుపొందగా.. ఈసారి యూపీ వారియర్స్ చివరి ఓవర్ వరకూ పోరాడింది. కానీ, డీవై పాటిల్ మైదానంలో 208 పరుగుల ఛేదనలో ఆ జట్టును గుజరాత్ జెయింట్స్ బౌలర్లు 197కే కట్టడి చేశారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్(2-25), జార్జియా వరేహం(2-30), సోఫీ డెవినె(2-55)లు రెండేసి వికెట్లతో రాణించారు.
End of a high-scoring contest in Navi Mumbai! @Giant_Cricket 🧡 kick-off their #TATAWPL 2026 campaign with a 🔟-run victory over #UPW
Scorecard ▶️ https://t.co/0Vl9vFyTyq#KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/TUpevakZ6v
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
భారీ ఛేదనలో యూపీ వారియర్స్‌కు ఆదిలోనే షాకిచ్చింది రేణుకా సింగ్. డేంజరస్ ఓపెనర్ కిరణ్ నవగరే(1)ను ఔట్ చేసి గుజరాత్ జెయింట్స్‌కు బిగ్ బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఫొబే లిచ్‌ఫీల్డ్(78), మేగ్ లానింగ్(30)లు ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. వరేహం ఒకే ఓవర్లో లానింగ్, హర్లిన్ డియోల్(0)ను వెనక్కి పంపి యూపీని కష్టాల్లోకి నెట్టగా.. ఆ తర్వాత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(1)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది రేణుక. అంతే.. చూస్తుండగానే మూడు బిగ్ వికెట్లు పడ్డాయి. 74కే 4 వికెట్లు పడినవేళ క్రీజులోకి వచ్చిన శ్వేతా షెహ్రావత్(25) తొలి బంతినే సిక్సర్‌గా మలవగా స్కోర్ 80 దాటింది.
Powerplay done ✅
Partnership 🔛
Skipper Meg Lanning and Phoebe Litchfield take @UPWarriorz to 46/1 👏
Updates ▶️ https://t.co/0Vl9vFyTyq#TATAWPL | #KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/W4lTlxouEv
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
ఆ తర్వాత గార్డ్నర్ ఓవర్లో రెండు ఫోర్లు, సింగిల్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకుంది లిచ్‌ఫీల్డ్. నేనేమీ తక్కువా అని షెహ్రావత్ 4, 6 బాదేయగా స్కోర్ వంద దాటింది. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని విడదీసిన రాజేశ్వరి గైక్వాడ్ యూపీని దెబ్బకొట్టింది. ఆ తర్వాత డియాండ్ర డాటిన్(12) బ్యాట్ ఝులిపించినా.. వికెట్ ఇచ్చేసింది. అంతే.. చివరి ఓవర్లో ఎకిల్‌స్టోన్ వికెట్ పడగా.. 10 పరుగుల తేడాతో గుజరాత్ బోణీ చేసింది.
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అషే గార్డ్నర్(65) అర్ధ శతకంతో మెరవగా.. అనుష్క శర్మ(44) యూపీ బౌలర్లను ఉతికేసింది. వీరిద్దరూ ఔటయ్యాక టెయిలెండర్లు జార్జియా వరేహం(27 నాటౌట్), భారతి ఫుల్మలి(14 నాటౌట్)లు సైతం సిక్సర్లతో చెలరేగారు. దాంతో, నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
Innings Break!
65(41) from skipper Ashleigh Gardner 👏
44(30) from Anushka Sharma 👌A 𝐆𝐢𝐚𝐧𝐭 batting effort from @Giant_Cricket to put on 2⃣0⃣7⃣ on the board 🧡
Scorecard ▶️ https://t.co/0Vl9vFyTyq#TATAWPL | #KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/z6YZuMUrQw
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026