Vignesh Shivan | ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో తండ్రులు సైతం పిల్లల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) సైతం ఫాదర్స్ డే సందర్భంగా ఆసక్తికర ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తన కవల పిల్లలు ఉయిర్ (Uyir), ఉలగ్ (Ulag)తో ఐకానిక్ బాహుబలి సన్నివేశాన్ని (Baahubali pose) రీ క్రియేట్ చేశారు.
డార్లింగ్ ప్రభాస్ నటించిన బాహుబలి (Baahubali) చిత్రంలో శివగామి (రమ్యకృష్ణ) నీటిలో మునుగుతూ బాహుబలిని ఎలా అయితే చేత్తో పైకి లేపి ఉంచుతుందో.. అదే సీన్‌ను విఘ్నేశ్ తాజాగా రీక్రియేట్ చేశారు. నీటి అడుగున నిలబడి తన ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగ్ను చేత్తో ఎత్తి పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘మై డియర్ బాహుబలి 1 & 2.. మీ ఇద్దరి మూలంగానే నాకు ఇది హ్యాపీ ఫాదర్స్ డే. మీ ఇద్దరితో లైఫ్ చాలా బావుంది. లవ్ యూ ఉయిర్, ఉలగ్’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో 2022 జూన్ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు.
Also Read..
train collision | రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీలు.. ఐదుగురు మృతి
VK Sasikala | సమయం ఆసన్నమైంది.. నా రీఎంట్రీ మొదలైంది : వీకే శశికళ కీలక ప్రకటన