కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిలిగురి వద్ద అగర్తాల నుంచి సిల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను (Kanchanjunga Express) గూడ్స్ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ప్రమాదం ధాటికి రెండు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండు పట్టాలపై నుంచి పక్కకు పడిపోయాయి. పలు కోచ్‌లు నుజ్జునుజ్జు అయ్యాయి. గూడ్స్ రైలు ఇంజిన్ ఓ బోగీ కిందికి దూసుకెళ్లింది. ఇక గూడ్స్ రైలు డబ్బాలు అంత దూరంలో పడిపోయాయి.
రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీ కొట్టినట్లు చెప్పారు. ఈ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.