WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌ను థ్రిల్లింగ్ విక్టరీతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) అనూహ్యంగా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానుంది. తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న తను ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. వస్త్రాకర్ ఆరోగ్యం గురించి ఆర్సీబీ హెడ్‌కోచ్ మలోలాన్ రంగరాజన్ కీలక అప్డేట్ ఇచ్చాడు.
‘డబ్ల్యూపీఎల్ ఆరంభ పోరుకు పూజా వస్త్రాకర్ అందుబాటులో లేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) నుంచి రెండు వారాలకు ముందు బయటకొచ్చేసిన వస్త్రాకర్ అనూహ్యంగా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడతోంది. దాంతో.. తను మరో రెండు వారాలు డబ్ల్యూపీఎల్‌కు దూరం కానుంది. ఇదివరకూ ఆమె భుజం నొప్పితో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోలుకుంది.
🚨 RCB’s Pooja Vastrakar ruled out for at least 2 weeks with hamstring injury
She picked up the injury at the CoE and will spend 2 further weeks at the facility pic.twitter.com/gixtZ5aRel
— Cricbuzz (@cricbuzz) January 10, 2026
ఇప్పుడు తొడ కండరాల గాయం వస్త్రాకర్‌ను విశ్రాంతి తీసుకునేలా చేసింది. తను ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేం. కాకపోతే వారం వారం ఆమె ఆరోగ్యాన్ని అంచనా వేస్తాం’ అని రంగరాజన్ వెల్లడించాడు. డబ్ల్యూపీఎల్‌లో నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న పూజ మూడు సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ఆడింది. నాలుగో సీజన్ వేలంలో ఈ స్టార్ ప్లేయర్‌ను రూ.85 లక్షలకు ఆర్సీబీ కొన్నది. మొత్తంగా ఈ టోర్నీలో16 మ్యాచుల్లో 126 రన్స్ చేసిందీ హిట్టర్. బంతితోనూ రాణించి ఏడు వికెట్లు పడగొట్టింది.
ఆరంభ వేడులక అనంతరం శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ ఉత్కంఠ విజయంతో బోణీ చేసింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో 65కే సగం వికెట్లు పడినా.. నదినే డీక్లెర్క్(63 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో బెంగళూరును గెలిపించింది. ఆఖరి ఓవర్లో 18 రన్స్ అవసరమవ్వగా వరుసగా 6, 4, 6, 4 బాదింది. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైపై 3 వికెట్ల తేడాతో మంధాన సేన జయభేరి మోగించింది.
“𝙙𝙚 𝙆𝙡𝙚𝙧𝙠 𝙝𝙖𝙨 𝙙𝙤𝙣𝙚 𝙞𝙩 𝙝𝙚𝙧𝙨𝙚𝙡𝙛” will echo through for ages to come. 🥶
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 9, 2026