Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliaments Winter Session) ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (All Party Meet)కు ఆహ్వానించింది. నవంబర్ 24న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు. పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
The All Party Meeting will be held on 24th November at 11am in the Main Committee Room, Parliament House Annexe, in view of the coming Winter Session of Parliament.
— Kiren Rijiju (@KirenRijiju) November 19, 2024
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliaments Winter Session) నిర్వహించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఈ నెల 26న ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో (Central Hall of Samvidhan Sadan) ఉభయ సభల సభ్యులు సమావేశం కానున్నారు. కాగా ఇదివరకూ నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్ 26ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. గురుగావ్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విపక్షాలు, అధికార ఎన్డీయే కూటమి సభ్యుల మధ్య పార్లమెంట్లో వాడి వేడి చర్చ సాగే అవకాశం ఉంది.
Also Read..
Actor Siddique | అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట
Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ వివాహం.. పెళ్లి డేట్ కూడా వచ్చేసింది..?
Meta | రూ.213 కోట్ల భారీ జరిమానా.. అప్పీల్‌కు వెళ్లనున్న మెటా